ఒకప్పుడు శివ రంగీలా సత్య కంపెనీ సర్కార్ వంటి ట్రెండ్ సెట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం తన స్థాయికి తగ్గట్లుగా సినిమాలు చేయడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇక వర్మ చేస్తున్న సినిమాలు ఎలా ఉన్నా కూడా తన స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. ఇక చివరగా వర్మ చేసిన ఒక పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది ఆఫీసర్ అనే చెప్పాలి.
నాగార్జున తో చేసిన ఆ సినిమా తర్వాత మళ్లీ పెద్ద హీరోలను టచ్ చేయలేదు. మధ్యలో కొన్ని క్రైమ్ బయోపిక్స్ కూడా చేయాలని అనుకున్నారు కానీ ఎందుకు మళ్లీ వెనక్కి తగ్గాడు ఇక చాలా కాలం తర్వాత వర్మ ఒక స్టార్ హీరోతో యాక్షన్ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఆ హీరో మరెవరో కాదు కన్నడలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉపేంద్ర. ఈ హీరోకు వర్మతో సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరిక అయితే ఉంది.
వర్మ కూడా అతనికి రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్నాడు. ఇక చాలా కాలంగా వీరి మధ్య కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇక ఫైనల్ గా ఒక సీరియస్ యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వర్మ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేశారు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో సోషల్ మీడియాలో న్యూస్ బాగానే వైరల్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.