రామ్‌ తర్వాతి సినిమాపై కీలక నిర్ణయం

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో రీబూస్ట్‌ వచ్చి… మాస్‌ హీరోగా మారిపోయాడు రామ్‌. ఆ సినిమా విజయం ఇచ్చిన ఊపుతో ‘రెడ్‌’ సినిమా ఎంచుకొని… అభిమానుల్లో ఆశలు పెంచాడు. అయితే మొన్నీమధ్య వచ్చిన సినిమా ఆశించిన విజయాన్ని అయితే అందివ్వలేకపోయింది. దీంతో తర్వాతి సినిమాతో ‘గట్టిగా కొట్టాలి’ అని ఫిక్స్‌ అయ్యాడు. దీని కోసం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే గురూజీ ప్రస్తుతం #ఎన్టీఆర్‌30తో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్‌ – రానా సినిమా పనులు కూడా చూసుకుంటున్నాడు. దీంతో రామ్‌ ప్లానింగ్‌ మార్చాడట.

‘ఛలో’, ‘భీష్మ’తో మంచి విజయాలు అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడట. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తీయడంతో వెంకీ కుడుముల సిద్ధహస్తుడు అని గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. వెంకీ గత చిత్రాలు చూసిన రామ్‌ తన కోసం ఓ మంచి లవ్‌ స్టోరీ సిద్ధం చేయమన్నాడట. దానికి తగ్గట్టే వెంకీ ఓ లైన్‌ వినిపించి ఓకే చేసుకున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే… త్వరలోనే సినిమా పట్టాలెక్కుతుందట. అంతేకాదు వీలైనంత త్వరగా సినిమా మొదలెట్టి, పూర్తి చేసి విడుదల చేసేయాలని రామ్‌ ఆలోచిస్తున్నాడట. ‘రెడ్‌’ ఫలితం ఇబ్బంది పెట్టేలోపు ఓ మంచి సినిమాతో వచ్చి అభిమానుల్ని అలరించాలనేది రామ్‌ ఆలోచన. ఇక్కడో విషయం ఏంటేంటే… రామ్‌ మళ్లీ ప్రేమ కథల వైపు వెళ్లాలనుకోవడం. మాస్‌ హీరో అంటూ.. ఇస్మార్ట్‌ రామ్‌ అంటూ గత కొద్ది రోజులు మాస్‌ పదాలనే వాడుతున్న రామ్‌… ప్రేమకథల హీరోగా ఎలా మెప్పిస్తాడో?

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus