Ram Pothineni, Lingu Swamy.: రామ్ కోసం ఊరమాస్ టైటిల్ ను సెలెక్ట్ చేసిన లింగు స్వామి..!

Advertisement

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.’శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్’ బ్యాన‌ర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాట తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది.రామ్ కెరీర్లో తొలి బైలింగ్వల్ మూవీ ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు లింగుస్వామి..’హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ వంటి వరుస హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కావడంతో దీని పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్‌ కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి.జూలై 12 నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ టైటిల్ ను ఫిక్స్ చేసాడట దర్శకుడు లింగు స్వామి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ టైటిల్ ‘ఉస్తాద్’ అని తెలుస్తుంది. దాదాపు ఇది ఫిక్స్ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీలో రామ్ పేరు `ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్‌’ అన్న సంగతి తెలిసిందే.

రామ్ కెరీర్ లో అదే బిగ్గెస్ట్ హిట్. సో ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు.. లింగుస్వామి- రామ్ ల చిత్రానికి ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌టన వచ్చే అవ‌కాశం ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus