తనలోని సరికొత్త టాలెంట్ ను బయటపెట్టిన రామ్

హీరోయిన్లు అప్పుడప్పుడూ తమలో దాగి ఉన్న టాలెంట్స్ లో ఏదో ఒక సందర్భంలో జనాలకి రుచి చూపిస్తుంటారు కానీ.. హీరోలు మాత్రం 90% యాక్టింగ్ కి మాత్రమే ఫిక్స్ అయిపోయి.. నటన తప్ప మరో విషయంలో కనీసం ఆసక్తి కూడా చూపించరు. కానీ.. అప్పుడప్పుడూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటివారు పాటలు పాడి “మేమూ పాడగలం” అని తెలియజేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో రామ్ కూడా జాయిన్ అయ్యాడు. రామ్ & దేవిశ్రీప్రసాద్ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన మాగ్జిమమ్ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఆ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ తోనే రామ్ తో “హలో గురు ప్రేమకోసమే” సినిమాలో ఒక పాట పాడించాడట దేవిశ్రీప్రసాద్. ఆల్రెడీ హైద్రాబాద్ లోని స్టూడియోలో పాట పాడించడం కూడా పూర్తయ్యిందట. మంచి లైవ్లీ సాంగ్ కావడంతో రామ్ పాడితేనే అవుట్ పుట్ బాగుంటుందని దేవి భావించడంతో రామ్ ఇలా పాడడం జరిగింది. సినిమాకి రామ్ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరి ఆ స్పెషల్ సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus