అందరికి మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో యూట్యూబ్ లో సినిమాలు, కామెడీ స్కిట్లు, ఇతర వీడియోలన్నింటికి కూడా వ్యూయర్ షిప్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే తెలుగు నుంచి హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసిన ప్రతి సినిమాకు నార్త్ లో కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఇలా హిందీలో బాగా పాపులారిటీ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. అతడి పాత సినిమాలు ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నా.. భారీ వ్యూస్ వస్తున్నాయి.
ఈ క్రమంలో యూట్యూబ్ లో పెట్టిన తన సినిమాలన్నింటితో కలిపి రామ్ ఏకంగా రూ.200 కోట్ల వ్యూస్ సాధించడం విశేషం. అతను తాజాగా 2 బిలియన్ క్లబ్ లో చేరిన నేపథ్యంలో తన సినిమాల వ్యూస్ కి సంబంధించిన పీఆర్వో టీమ్ బ్రేకప్స్ తో వివరాలను వెల్లడించింది. రామ్ కెరీర్ లోనే అత్యధికంగా ‘నేను శైలజ’ సినిమాకి యూట్యూబ్ లో ఏకంగా 44 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆ తరువాత స్థానం ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాదక్కించుకుంది .
ఈ సినిమా 40.4 కోట్ల వ్యూస్ ను సాధించింది. ఆ తరువాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాకి 31.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ పాతిక కోట్ల వ్యూస్ కి పైగానే రాబట్టింది. అలానే ‘హైపర్’ సినిమా 17 కోట్ల వ్యూస్ సాధించింది. మిగిలిన రామ్ సినిమాలన్నింటికీ మొత్తం కలిపిస్తే 2 బిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
సౌత్ లో తన సినిమాల వ్యూస్ తో 2 బిలియన్ మార్క్ ను అందుకున్న తొలి హీరో రామ్ అనే చెప్పాలి. రామ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం రామ్.. లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అలానే బోయపాటితో ఓ సినిమా ఒప్పుకున్నాడు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!