Gopichand: గోపీచంద్ సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హిట్ కాంబినేషన్లలో గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం సినిమాలు గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. గోపీచంద్ మార్కెట్ ను పెంచడంలో శ్రీవాస్ కృషి ఎంతో ఉందని చాలామంది భావిస్తారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో రామబాణం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ కు అచ్చొచ్చిన సున్నా సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా గోపీచంద్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు కావడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందంటే కనీసం 35 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులు అమ్ముడైతే మాత్రమే నిర్మాతలకు ప్లస్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి.

శ్రీవాస్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో చూడాలి. ఈ బ్యానర్ లో తెరకెక్కి గతేడాది విడుదలైన కార్తికేయ2, ధమాకా సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో లాభాలను సొంతం చేసుకున్న బ్యానర్లలో పీపుల్స్ మీడియా బ్యానర్ కూడా ఒకటి. రామబాణం మూవీతో ఈ బ్యానర్ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. గోపీచంద్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus