Ramabanam , Ugram: రామబాణం, ఉగ్రం సినిమాల బుకింగ్స్ నిరాశపరుస్తున్నాయా?

  • May 4, 2023 / 12:14 AM IST

మరికొన్ని గంటల్లో రామబాణం, ఉగ్రం సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రామబాణం సినిమా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలవుతూ ఉండగా ఉగ్రం సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. ట్రైలర్స్ రొటీన్ గా ఉండటం ఈ రెండు సినిమాలకు ఒక విధంగా మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

విరూపాక్ష సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విరూపాక్ష సినిమాను మించిన టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అటు గోపీచంద్ కు ఇటు నరేష్ కు కెరీర్ పరంగా భారీ సక్సెస్ కీలకం అనే సంగతి తెలిసిందే. రామబాణం సినిమా 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఉగ్రం సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కింది.

ఈ సినిమాలతో (Ramabanam) భారీ సక్సెస్ లను సొంతం చేసుకుంటే అటు గోపీచంద్, ఇటు నరేష్ ఈ సినిమాలతో కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గోపీచంద్, నరేష్ ఒక స్థాయిని మించి కెరీర్ పరంగా ఎదగలేకపోతున్నారు. ఈ ఇద్దరు నటులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. గోపీచంద్, నరేష్ పారితోషికాలు కూడా పరిమితంగానే ఉన్నాయి.

ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోని నేపథ్యంలో మే నెల సినిమాలపైనే ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాలి. పరిమిత బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus