Chiranjeevi: మెగాస్టార్ ట్విట్టర్ లో ఇలా చేశారేంటి..?

స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. తరచూ ఫోటోలను అప్ లోడ్ చేయడంతో పాటు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వడం ద్వారా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి 2020 సంవత్సరం ఉగాది పండుగ సమయంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చేరారు. ఆ తరువాత ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉంటూ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను పంచుకున్నారు.

చిరంజీవికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉండగా ఆయన మొదట చరణ్ ను మాత్రమే ఫాలో అయ్యేవారు. ఆ తరువాత చరణ్ ను కూడా అన్ ఫాలో చేసిన చిరంజీవి కేవలం ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిని మాత్రమే ఫాలో అవుతున్నట్టు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిరంజీవి తనను మాత్రమే ఫాలో కావడంపై స్పందించిన రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే చిరంజీవి రామజోగయ్య శాస్త్రికి ఝలక్ ఇస్తూ ఆయనను కూడా అన్ ఫాలో చేశారు.

ప్రస్తుతం చిరు ట్విట్టర్ ఫాలోయింగ్ జీరోగా ఉంది. అయితే చిరంజీవి రామజోగయ్యకు ఇలా షాక్ ఇవ్వడంపై మెగాభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి ట్విట్టర్ ఖాతాను ఆయనే ఉపయోగిస్తున్నారా..? లేక చిరంజీవి టీం ఉపయోగిస్తుందా..? అని మెగాస్టార్ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా సీజీ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మే 13న ఆచార్య రిలీజ్ అయ్యేలా కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus