మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా పై మొదటి నుండి మంచి బజ్ ఏర్పడింది.
టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ దారుణంగా నమోదయ్యాయి.మొదటి వీకెండ్ ను ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.ఇక 4 వ రోజు అయిన సోమవారం రోజున మరింత దారుణం అనే చెప్పాలి. ఒకసారి 4 కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.25 cr |
సీడెడ్ | 0.64 cr |
ఉత్తరాంధ్ర | 0.56 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.21 cr |
గుంటూరు | 0.31 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.76 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.76 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 4.52 cr |
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కానీ ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.
4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.48 కోట్ల షేర్ ను రాబట్టాలి.డబ్బింగ్ సినిమా ముందు రవితేజ సినిమా నిలబడలేకపోతుండడం గమనార్హం.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?