Ramarao On Duty Collections: తీవ్రంగా నిరాశపరిచిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఓపెనింగ్స్..!

  • August 1, 2022 / 06:14 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా పై మొదటి నుండి మంచి బజ్ ఏర్పడింది.

టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.మొదటి వీకెండ్ ను ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.18 cr
సీడెడ్ 0.62 cr
ఉత్తరాంధ్ర 0.53 cr
ఈస్ట్ 0.37 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.29 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.73 cr
వరల్డ్ వైడ్ టోటల్ 4.28 cr

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. కానీ ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.28 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.13.72 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది అసాధ్యంగానే కనిపిస్తుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus