తెలుగు ప్రేక్షకులకు ‘మాతంగి’ చిత్రం తప్పకుండా నచ్చుతుంది : రమ్యకృష్ణ

  • December 5, 2017 / 10:48 AM IST

‘బాహుబలి’లో శివగామి క్యారెక్టర్‌లో అత్యద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా ‘మాతంగి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ ‘మాతంగి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరాం, సంపత్‌, కళాభవన్‌ మణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడై సెన్సేషన్‌ సృష్టించింది. బిజినెస్‌పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి క్రేజీ బిజినెస్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం డిసెంబర్‌ 15న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ‘మాతంగి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని డిసెంబర్‌ 4న హైదరాబాద్‌ ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణ, ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి, చిత్ర నిర్మాత వినయ కృష్ణ వేదిక పై పాల్గొనగా రమ్యకృష్ణ ముద్దుల తనయుడు రుత్విక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ – ”వినయ వెరీ బిగ్‌ క్రిటిక్‌. బేసిగ్గా తనకి ఏ కథలు చెప్పినా త్వరగా నచ్చవు. అలాంటిది ఈ సినిమా కథ నచ్చి తెలుగులో ‘మాతంగి’ రిలీజ్‌ చేస్తున్నారు. రమ్యకృష్ణ ఏ క్యారెక్టర్‌ చేసినా తను తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అనేంతగా ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి చేస్తారు. నాకు రమ్యకృష్ణగారి ‘అమ్మోరు’ చాలా ఇష్టం. ‘మాతంగి’ ట్రైలర్‌ చూస్తుంటే ‘అమ్మోరు’ షేడ్స్‌ కన్పిస్తున్నాయి. అమ్మవారి క్యారెక్టర్‌లో రమ్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తుంటే నిజంగా దేవతని చూసిన ఫీల్‌ కలిగింది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి నిర్మాతగా వినయ సక్సెస్‌ కావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

ప్రముఖ హీరోయిన్‌ రమ్యకృష్ణ మాట్లాడుతూ – ”శ్రీనివాస విజువల్స్‌ బేనర్‌లో కొన్ని సీరియల్స్‌ చేసాం. ఫస్ట్‌ టైమ్‌ ఒక చిన్న ప్రయత్నంగా సినిమా చేస్తున్నాం. హర్రర్‌, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఈ చిత్రంలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో నటించాను. ముఖ్యంగా ‘అమ్మోరు’ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్‌ 15న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా రిలీజ్‌ విషయంలో మాకు సపోర్ట్‌ చేస్తున్న వేణుగోపాల్‌, సజ్జుగారికి నా థాంక్స్‌” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus