రమ్యకృష్ణ – కృష్ణవంశీ కుమారుడు.. ఎంతగా ఎదిగిపోయాడో?

  • February 15, 2021 / 07:03 AM IST

ఫ్యామిలీ కథలతో అలాగే దేశభక్తి సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రమ్యకృష్ణ అప్పట్లో హీరోయిన్ గా ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరు పెళ్లి అనంతరం పర్సనల్ లైఫ్ ను చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తూ ప్రైవసిని మెయింటైన్ చేస్తున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో నిత్యం ఏదో విషయంపై స్పందిస్తూనే ఉంటారు. కానీ పర్సనల్ లైఫ్ విషయాల గురించి చర్చించరు.

అయితే వీరి కుమారుడితో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకు పేరు రిత్విక్ వంశీ. అయితే నేడు అతని పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ముందుగా కృష్ణవంశీ ఈ ఫొటోను షేర్ చేస్తూ..గాడ్ బ్లెస్స్ యూ నాన్న, రిత్విక్ వంశీ చాలా పెద్దవాడు అవుతున్నాడు. తన టీనేజ్ వయస్సులోకి వచ్చేశాడు. అతను అందంగా పెరుగుతున్నాడు కాదా?“ అని విష్ చేయగా తల్లి రమ్య కృష్ణ కూడా చిన్నవాడు ..

అందంగా కనిపిస్తున్నాడు అంటూ ట్వీట్ చేశారు. మరి రుత్విక్ తండ్రి లాగా డైరెక్షన్ వైపు వెళతాడా లేక అమ్మ బాటలో నటన వైపు కెరీర్ ను స్టార్ట్ చేస్తాడా? అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు అగాల్సిందే.

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus