సాధారణంగా హీరోయిన్లకు పెళ్లిళ్లు అయితేనే కెరీర్ దాదాపు ముగిసింది అంటుంటారు. ఆ తరువాత వాళ్ళు సినిమాల్లో నటించినప్పటికీ మునుపటి స్థాయిలో పారితోషికం అందుతుందని చెప్పలేం. అయితే మన శివగామి రమ్యకృష్ణ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్ల రేంజ్లో పారితోషికం అందుకుంటూ అందరికీ షాకిస్తుంది. ‘బాహుబలి'(సిరీస్) తరువాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. తరువాత ఈమె నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘సూపర్ డీలక్స్’ ‘గ్యాంగ్'(తమిళ్) వంటి చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి.
ప్రస్తుతం ఈమె చేసేది తల్లి, అత్త పాత్రలే అయినప్పటికీ రమ్యకృష్ణ ఉంటే చాలు.. సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగా పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది.రమ్యకృష్ణ షూటింగ్లో పాల్గొనే ఒక్కో రోజుకు రూ.10 లక్షల చొప్పున తీసుకుంటుందట. ఈమె 10రోజులు కనుక షూటింగ్లో పాల్గొంటే 1కోటి రూపాయలు వరకూ అందుకుంటుందన్న మాట. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అలాగే సాయి తేజ్ ల కొత్త చిత్రాల్లో నటిస్తుంది.
ఆ సినిమాలకు కూడా ఈమె అదే స్థాయిలో పారితోషికం అందుకుంటుందట. స్టార్ హీరోయిన్లైన పూజ హెగ్డే, రష్మిక , కీర్తి సురేష్ వంటి వారు రూ.1.5 కోట్ల నుండీ రూ.2కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. ఇక కుర్ర హీరోయిన్లైన రాశీ ఖన్నా, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారు 0.60 కోట్ల వరకూ అందుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే రమ్య కృష్ణ .. కుర్ర హీరోయిన్లను మించే పారితోషికం తీసుకుంటుందన్న మాట.
Most Recommended Video
చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!