అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది రమ్య మోక్ష. వాస్తవానికి ఆమె పాపులర్ అయ్యింది పచ్చళ్ళ వ్యాపారంతో కాదు… ఒక కస్టమర్ ని ఆమె దారుణమైన పదజాలంతో తిడుతూ ఫేమస్ అయ్యింది. ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏ రేంజ్లో పాపులర్ చేస్తారో అందరికీ తెలిసిందే. దానిని ఆమె మరింతగా క్యాష్ చేసుకోవాలనుకుంది. ఒక సినిమాలో కూడా నటించేసింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ కూడా దక్కించుకుంది.
ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కారణంగా హౌస్లో ఆమె ఎక్కువ రోజులు ఉంటుందని అంతా భావించారు. కానీ కట్ చేస్తే 2 వారాలకే బయటకు వచ్చేసింది. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేయడం, టంగ్ స్లిప్ అవ్వడం వంటి ఇతరత్రా కారణాలతో ఈమె పై నెగిటివిటీ ఏర్పడింది. టాప్ కంటెస్టెంట్స్ అయినటువంటి తనూజ, కళ్యాణ్..లపై ఈమె చెలరేగిపోవడంతో హోస్ట్ నాగార్జున కూడా చివాట్లు పెట్టాడు. తర్వాత ఆమె ఫిజికల్ టాస్కుల్లో బాగా చేసినా అప్పటికే ఆడియన్స్ ఈమెను నెగిటివ్ గా తీసుకోవడం వల్ల ఓట్లు పడలేదు.
అందువల్ల ఎలిమినేట్ అయిపోయింది. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులకు గాను బిగ్ బాస్ యాజమాన్యం ఈమెకు ఎంత పారితోషికం ఇచ్చినట్టు? అనే డౌట్ చాలా మందిలో ఉంది. మొత్తానికి ఆ డౌట్ కి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. ఈమెకు ఒక్కో వారానికి గాను రూ.2 లక్షల వరకు పారితోషికం ఆఫర్ చేశారట. సో 2 వారాలకు గాను మొత్తంగా రూ.4 లక్షలు అందుకుని ఉండవచ్చు అని అంచనా.