మార్చి 4న విడుదలవుతున్న ‘ఓ మల్లి’

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ మల్లి’. ఆర్.ఎ.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ  చిత్రం మార్చి 4న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా….

నిర్మాత బి.ప్రశాంత్ మాట్లాడుతూ ‘’ఓ గ్రామంలోని యువతి యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా అవుట్ పుట్ బావుండాలని రెండు సంవత్సరాలు యూనిట్ సభ్యులందరం కష్టపడ్డాం. చివరకు ఓ మంచి చిత్రాన్ని తీRaశామన్న సంతృప్తి కలిగింది. సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నాం. సందేశాత్మక కథతో తెరకెక్కిన చిత్రమిదని, రమ్యశ్రీ అద్భుతంగా నటించడమే కాదు సినిమాను అద్భుతంగా తెరకెక్కాంచారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కె.దత్తుగారి సినిమాటోగ్రఫీతో చాలా నేచురల్ గా చూపించారు. ఆయన అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది. డిపరెంట్ చిత్రమిది’’ అన్నారు.

ఆకాష్, ఎల్.బి.శ్రీరామ్, శ్రీధర్, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: కె.దత్తు, సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.రమ్యశ్రీ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus