రానా దగ్గుబాటి… అప్పటి వరకూ టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉండేవాడు. అలాంటి ఈయన సడెన్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసాడు.మిహీక బజాజ్ అనే ఈవెంట్ మేనేజర్ ను అతను చెప్పినట్టు గానే ఆగష్టు 8న కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే రానా, మిహీక ల పెళ్లి జరిగింది. తరువాత పూర్తిగా ఫ్యామిలీ మెన్ లా మారిపోయాడు రానా.
భార్య మిహీకతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. మిహీక కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే మిహీక కూడా ఓ టాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే వార్త ఇప్పుడు ఊపందుకుంది.తన భర్త రానా నటించబోయే సినిమాలో మిహీక హీరోయిన్ గా నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఓ తమిళ దర్శకుడు రానాతో తెరకెక్కించబోయే సినిమాలో మిహీకను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది. ఇక రానా పై వచ్చే గాసిప్స్ ను మిహీక ఏమాత్రం పట్టించుకోదట. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కామనే అని.. అవి అర్ధం చేసుకునే మెర్చ్యూరిటీ తనకు ఉందని.. ఇటీవల రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
1
2
3
4
5
6
7
8
రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!