బిగ్ బాస్ 5: అందుకే రానా కూడా నో ఆనేశాడు!

  • July 8, 2021 / 09:17 AM IST

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు జనాలకు కూడా బాగానే కనెక్ట్ అయ్యింది. దీంతో ప్రతి సీజన్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. హోస్ట్ గా చేసే సెలబ్రెటీలు చేయలేము అని భయపడితున్నా కూడా నిర్వాహకులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కుదిరితే పెద్ద హీరోలు లేదంటే మీడియం రేంజ్ హీరోలు అంటూ భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చిమరి లాక్కోస్తున్నారు.

ఇక ఎన్టీఆర్, నాని అనంతరం నాగార్జున వరుసగా రెండు సీజన్స్ ను సక్సెస్ చేసినప్పటికీ 5వ సారి చేయబోయే హీరోపై సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ఈసారి కూడా నాగ్ తోనే కంటిన్యూ అవుదామని అనుకున్నప్పటికి వరుస షూటింగ్స్ వలన ఆయన కుదరదు ఆనేశాడు. ఇక రానా దగ్గుబాటితో గత కొన్ని వారాలుగా సంప్రదింపులు చేపట్టిన స్టార్ మా చివరకు నిరాశను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

రానా దగ్గుబాటికి షో నిర్వహించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నెంబర్ వన్ యారీ వంటి ప్రోగ్రాంతో మంచి గుర్తింపు అందుకున్నాడు. బిగ్ బాస్ కంటే అది చిన్నదే అయినా కాస్త ట్రైనింగ్ ఇస్తే రానాను మరింత పవర్ఫుల్ గా సిద్ధం చేయాలని అనుకున్నారు. అంతే కాకుండా అతనికి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. కానీ రానా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. పైగా బిగ్ బాస్ లాంటి షో చేయడం కాస్త రిస్క్ తో కూడుకున్న పని అని హోస్ట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus