Rana Daggubati: నా భార్యని ఆ యాప్ లో కలిశాను… తర్వాత పెళ్లైంది : రానా

రానా (Rana Daggubati) లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘షి సెడ్ ఎస్’ అంటూ ప్రముఖ ఈవెంట్ మేనేజర్ మిహీకా బజాజ్ ను అతను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. తర్వాత కొద్దిరోజులకే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మిహీకా బజాజ్… రానా బాబాయ్ వెంకటేష్ (Venkatesh) కూతురు ఆశ్రిత క్లాస్మేట్ అని.. ఆమె పెళ్ళిలో వీరిద్దరూ క్లోజ్ అయ్యారని అప్పట్లో ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. వారి పరిచయం స్నేహంగా మారడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది అని కూడా తెలిపాడు రానా.

Rana Daggubati

అయితే ఇప్పుడు మరో ఊహించని విషయం చెప్పి షాక్ ఇచ్చాడు. ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)   సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా రానా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. “కరోనా టైంలో బోర్ కొట్టి కొత్త కొత్త వాళ్ళతో పరిచయం కోసమని హౌస్ పార్టీ అనే యాప్ ను డౌన్లోడ్ చేశా. ఆ యాప్ ద్వారా మిహీకా పరిచయమైంది. ఆ తర్వాత వారానికే మా పెళ్లి సెట్ అయ్యింది.

‘వీడు మంచోడా లేక వెర్రోడా’ అని ఆమె ఆలోచించలేదు. కన్ఫ్యూజ్ అయ్యింది. నా జీవితంలో వైల్డెస్ట్ థింగ్’ అంటే అదే..! ” అంటూ రానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా.. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరోపక్క తమ సంస్థలో కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నాడు.

అప్పుడు రాఖీ.. ఇప్పుడు విడాకులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus