రానాతో రెజీనా!

  • August 8, 2016 / 11:40 AM IST

దగ్గుబాటి రానా ప్రస్తుతం ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలవుతుంది. అప్పటివరకూ రానా ఫుల్ బిజీ. అయితే దీని తరువాత ఓ చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలో నటించాలనేది రానా ఆలోచన. దీనికోసం సత్యశివ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయాడానికి అంగీకరించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేసినట్లు సమాచారం. నాగశౌర్య, సందీప్ కిషన్, సాయి ధరం తేజ్ వంటి యువ హీరోలతో జత కట్టిన రెజీనా ఇప్పుడు రానాతో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రెజీనా చేతిలో రానా సినిమాతో కలిపి ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాకు 1945 అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus