అంచనాలు పెంచేస్తున్న ‘అరణ్య’ టీజర్..!

  • February 13, 2020 / 06:58 PM IST

భల్లాల దేవుడు.. రానా నటిస్తున్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అరణ్య’. ఇది పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ప్రఖ్యాత ‘ఇరోస్ ఇంటెర్నేషనల్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. హిందీలో ‘హాథీ మేరే సాథి’ గా, కన్నడ లో ‘కాదన్’ గా ఈ చిత్రం ఏకకాలంలో ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది. అరణంలో జీవించే ‘అరణ్య’ అనే వ్యక్తి.. రక రకాల వంకలతో అడవులని నాశనం చేస్తూ.. అందులో ఉన్న జీవరాసులని అంతం కాకుండా తన అడవిని ఎలా కాపాడుకున్నాడు. దానికి ఏనుగులు ఎలా సాయపడ్డాయి.. అనే కథాంశంతో టీజర్ తెరకెక్కినట్టు తెలుస్తుంది.

ముందుగా టీజర్ గురించి చెప్పాలంటే.. రానా నటన గురించే చెప్పాలి. ఆఫ్ బీట్ మూవీస్ చేస్తే.. తన నట విశ్వరూపం ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించేలా ఈ చిత్రంలో రానా నటించినట్టు తెలుస్తుంది. ఇక ఏ.ఆర్.అశోక్ కుమార్ అందించిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించినట్టు టీజర్ స్పష్టం చేస్తుంది. ఏమైనా ఈ టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచేసిందనే చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus