విక్టరీ వెంకటేష్ గురు.. తేజ “నేనే రాజు నేనే మంత్రి” సినిమా విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అదే జోష్ తో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఇందులో అక్కినేని యువ హీరో నాగచైతన్య, దగ్గుబాటి క్రేజీ హీరో రానాలు స్పెషల్ రోల్స్ చేయనున్నట్లు తెలిసింది. ఇదివరకు ప్రేమమ్, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల్లో వెంకీ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.
అదే మాదిరిగా గెస్ట్ రోల్స్ చేయడానికి చైతూ, రానా ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వెంకటేశ్ బర్త్ డే ( డిసెంబర్ 13 )న మొదలుకాబోతోంది. కాలేజీ లెక్చలర్ గా వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాకి “ఆటా నాదే.. వేటా నాదే” అనే అటైటిల్ పరిశీలిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుందా?, మెహ్రీన్ ఫిక్స్ అయిందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.