‘వెంకీమామ’ లో అతిధి పాత్ర చేయబోతున్న రానా ?

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించబోతున్న తాజా మల్టీ స్టారర్ ‘వెంకీమామ’. ఈ చిత్రం ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ చెప్పిన కథలో సురేష్ బాబు మార్పులు చెప్పారని.. అయితే వాటిని సరిగ్గా డెవలప్ చేయడంలో బాబీ విఫలమవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను కొట్టివేస్తూ.. ఫిబ్రవరి 21నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇప్పటి వరకూ వెంకటేష్ ‘ఎఫ్2’ ప్రమోషన్లలో బిజీగా ఉండడం.. అలాగే నాగ చైతన్య కూడా ‘మజిలీ’ షెడ్యూల్ లో బిజీగా ఉండడంతో ‘వెంకీ మామ’ లేట్ అయ్యినట్టు స్పష్టమవుతుంది.

ఇక ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ఓ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందుకోసం ఈ చిత్రంలో రానా కు ఒక చిన్న పాత్ర ను కూడా సృష్టించినట్లు టాక్ వినిపిస్తుంది. రానా కూడా బాబాయ్ తో నటించాలని ఉందని పలు మార్లు చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరబోతోందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ‘పవర్’ ‘సర్దార్ గబ్బర్ సింగ్ ‘ ‘జై లవ కుశ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రీయ అలాగే చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నారు. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ మరియు ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని… దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus