మోహన్ బాబుతో రానా ప్లాన్!

టాలీవుడ్ లో గొప్ప నటుల్లో మోహన్ బాబు కూడా ఒకరు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్యకాలంలో ఆయన కాస్త జోరు తగ్గించారు. ఎప్పటికో ఒక సినిమా చేస్తున్నారు. అది కూడా సొంత బ్యానర్ లో మాత్రమే నటిస్తున్నారు. రీసెంట్ గా మాత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తమిళంలో మణిరత్నం రూపొందిస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో నటిస్తున్నారు.

అలానే తెలుగులో ‘సన్నాఫ్ ఇండియా’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది కూడా సొంత బ్యానర్లో కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బయట బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి మోహన్ బాబు రెడీ అవుతున్నట్లు సమాచారం. నిన్న జరిగిన ‘మోసగాళ్ళు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన మోహన్ బాబు.. తాను సురేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాని రానా నిర్మించనున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ.. రానా ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం మోహన్ బాబు ఈ విషయాన్ని బయటపెట్టారు.

రానా ఈవెంట్ కి రాగానే.. అతడిని వేదిక పైకి పిలిచిన మోహన్ బాబు.. ఏడు గంటలకు వస్తానని చెప్పి.. పది గంటలకు వచ్చావ్.. నువ్ ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి నేను కూడా ఇలానే ఆలస్యంగా వస్తే ఒప్పుకుంటావా..? అంటూ రానాని ప్రశ్నించారు. దానికి రానా.. నేను తీయబోయే సినిమా మీ ఇంట్లోనే షూట్ చేస్తామని.. మీరు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే షూటింగ్ అంటూ బదులిచ్చాడు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్నప్పటికీ.. మోహన్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ని రానా నిర్మాణంలో చేయబోతున్నట్లు సీరియస్ గా చెప్పారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus