రంగస్థలం 10 డేస్ కలక్షన్స్

  • April 9, 2018 / 07:51 AM IST

చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటనకు అభినందనల వర్షం కురుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అన్నిఏరియాల్లో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబడుతోంది. అత్యధిక వేగంగా వందకోట్ల (గ్రాస్) క్లబ్ లో చేరిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. షేర్ కూడా వందకోట్లకు దగ్గర్లో ఉంది. నిన్నటి (ఏప్రిల్ 8) తో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 93.35 కోట్ల షేర్ రాబట్టింది. పదిరోజుల్లో రంగస్థలం సాధించిన కలక్షన్స్ ఏరియాల వారీగా (కోట్లలో)…

ఏరియా – షేర్

నైజాం : 19.91
ఉత్తరాంధ్ర : 9.53
తూర్పు గోదావరి : 5.87
పశ్చిమ గోదావరి :4.60
కృష్ణ : 5.40
గుంటూరు : 6.76
నెల్లూరు : 2.46
సీడెడ్ : 13.10
రెండు రాష్ట్రాల్లో మొత్తం : 67.63
కర్ణాటక : 7.62
ఇతర ప్రాంతాల్లో : 2.50
అమెరికా : 15.60
ప్రపంచవ్యాప్తంగా : 93.35

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus