మూడో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘రంగస్థలం1985’

ధృవ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రంగస్థలం 1985 అని పేరు పెట్టి ఆసక్తిని పెంచారు.  ఈ చిత్ర షూటింగ్ మొన్నటి వరకు రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగింది. శనివారంతో 3వ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు 40 శాతం టాకీ పార్ట్ తో పాటు ఒక పూర్తి పాట, మరొక పాట సగం వరకు పూర్తయ్యాయట. ఈ షెడ్యూల్ బాగా వచ్చినందుకు చిత్ర బృందం సంతోషంగా ఉంది. కొత్త షెడ్యూల్ ను టీమ్ ఈ నెలాఖరు నుండి హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో మొదలుపెట్టనున్నారు.

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అనసూయ అందాలతో అలరించనుంది. అలాగే జగపతి బాబు, అది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ గ్రామీణ కుర్రోడిగా నటిస్తున్నారు. ఇందులో అతని లుక్ కొత్తగా ఉండడంతో క్రేజ్ నెలకొని ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus