ప్రీమియర్ షోల ద్వారానే రికార్డులు బద్దలు కొట్టిన రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోను బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి క్రేజ్ ఎక్కువగా ఉన్నందున నిన్న రాత్రి అమెరికాలో అత్యధిక స్క్రీన్‌లపై ప్రీమియర్ షోలు వేశారు. దాదాపు అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కావడంతో రికార్డు సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్ షోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో రంగస్థలం 5వ స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్ సినిమా సర్డార్ గబ్బర్ సింగ్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవశం చేసుకుంది. చరణ్ కెరీర్ లో అమెరికాలో ప్రీమియర్ షోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రంగస్థలం నిలిచిపోయింది. ఒక్కరోజులో మిలియన్ డాలర్ల మార్కు క్రాస్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. అమెరికాలో ప్రీమియర్ షోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలు…

బాహుబలి 2 : 4 .5 MN
బాహుబలి 1 : 1 .3 MN
అజ్ఞాతవాసి : 1 .3 MN
ఖైదీ నెంబర్ 150 : 1 .2 MN
రంగస్థలం : 619k (సర్డార్ గబ్బర్ సింగ్ : 616k )

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus