మహేష్ తో ఇబ్బంది పడ్డామన్న రామ్ చరణ్

డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ‘రంగస్థలం’ సినిమా టాకీ పార్ట్ ఎప్పుడో పూర్తి అయింది. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే రఫ్ కట్ ని చూసిన సుకుమార్ కి కొన్ని సీన్లు నచ్చలేదట. అందుకే వాటిని మళ్ళీ తీస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రీ షూ చేస్తున్న సంగతిని చెప్పకుండా.. రాత్రి తాము షూటింగ్ లో ఉన్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేసారు. కమెడియన్ మహేష్ వల్ల తాము ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘గత రాత్రి జరిగిన షూట్‌లో టేక్‌ల మీద టేకులు తీసుకుంటూ కమెడియన్ మహేష్ టైమ్ అంతా తినేశాడు. దీని కోసం టీమంతా అక్కడే ఉండిపోయాం..’’ అంటూ కమెడియన్ మహేష్ తీసుకుంటున్న టేక్‌ల వీడియోని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

ఇందులో మహేష్ ని గెటప్ శీను కొట్టే సీన్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పాతికేళ్ళక్రితం నాటి ఓ అందమైన ప్రేమకథను వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నారు. పల్లెటూరి యువతీ యువకుల్లా సమంత, రామ్ చరణ్ పాత్రలకు ప్రాణం పోసినట్లు మూవీ స్టిల్స్ స్పష్టం చేశాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చిలో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus