‘రాణి గారి బంగళా’ ఆడియో విడుదల

బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియో బ్యానర్ పై ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాణి గారి బంగళా’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో జరిగింది. ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి బిగ్ సీడీను రిలీజ్ చేయగా.. నిర్మాత అచ్చిరెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీను ఎస్.వి.కృష్ణారెడ్డికు అందించారు. ఈ సందర్భంగా..
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ”మంచి హారర్ సబ్జెక్టు తీసుకొని సినిమా చేశారు. దివాకర్ గారు బాగా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ..”సినిమా టైటిల్ వింటుంటే హిట్ సౌండ్ వినిపిస్తుంది. దివాకర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఈశ్వర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆనంద్ ఈ సినిమాతో పెద్ద కమర్షియల్ హీరో కావాలని” అన్నారు.
దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ..”ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం కాని ‘రాణి గారి బంగాళా’ను ఫైనల్ చేశాం. ఈ టైటిల్ సినిమాకు యాప్ట్ అవుతుందని భావించాం. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశాం. ఈశ్వర్ అందించిన బాణీలు, ప్రభాకర్ గారి ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఆనంద్, రేష్మిలకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. శివకృష్ణ గారు నటించిన కాటికాపరి పాత్ర సినిమాలో చాలా కీలకమైందని” అన్నారు.
హీరో ఆనంద్ నందా మాట్లాడుతూ ‘’చిన్నప్పట్నుంచి హీరో కావాలనే ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అందరం కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా బాగా వచ్చింది. ఈశ్వర్ గారు మంచి సంగీతం అందించారు. దివాకర్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు.
పూర్ణిమ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను’’ అన్నారు.
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘’టైటిల్ చాలా బావుంది. ఆనంద్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. యూనిట్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంపూర్నేష్ బాబు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.కల్యాణ్, ఆర్.పి.పట్నాయక్, శ్రీనివాసరావు, అలీ,తరుణ్, సత్య ప్రకాష్, ప్రభ, అజయ్ నాయుడు, జబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, కాశీవిశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ పేరవల్లి, కథ: వి.లీనా, ప్రసాద్ వనపల్లె, ఎడిటర్: అనిల్ మల్ నాడు, కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: శ్రీనివాసరావు, సమర్పణ: బాలాజీ నాగలింగం, నిర్మాణం: వి.సినీ స్టూడియో, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.దివాకర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus