రొమాన్స్ కాదు.. పెర్ఫార్మెన్స్ చూడండి : రష్మీ

  • August 22, 2018 / 01:16 PM IST

పదేళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ రష్మీ కి మంచి బ్రేక్ రాలేదు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ షోలో క్లీవేజ్ షోలతో యువకుల మతులు పోగొట్టింది. సినీ అవకాశాలు పట్టేసింది. “గుంటూరు టాకీస్” సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన మూవీ “అంతకు మించి”. ఇందులో రష్మీ అంతకు మించి అందాలు ఆరబోసింది. ఆమె అందాలతోనే ఈ సినిమాకి హైప్ వచ్చింది. జానీ దర్శకత్వంలో జై హీరోగా నటించిన సినిమా ఆగస్టు 24 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రష్మీ అనేక విషయాలపై స్పందించింది. చాలా మంది ఈ చిత్ర పోస్టర్లు చూసి మీ పెర్ఫార్మెన్స్ గురించి కాకుండా మీ థైస్ గురించి, ఫిజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు.

దీనిపై ఒక నటిగా మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నను రష్మి ముందు ఉంచగా… “థైస్ ఉన్నాయండి ఏం చేయమంటారు? పోస్టర్లో కనిపించింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే..” అంటూ రష్మి అక్కడితో ఆ విషయాన్ని కొట్టిపడేసింది. ఇంకా మాట్లాడుతూ.. “ఇందులో శృతిమించిన గ్లామర్, ఎక్స్ ఫోజింగ్ ఉందని నేను భావించడం లేదు. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగులో కూడా గ్లామర్ చూపించాం. కేవలం ప్రోమో చూసి సినిమాపై అభిప్రాయానికి రావొద్దు. స్టోరీలో మంచి కంటెంటు ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది” అని రష్మీ చెప్పింది. మరి ఎంతమేర సినిమా ఆకట్టుకుందో రెండు రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus