అంతకుమించిన అందాలు ఆరబోస్తున్న రష్మీ గౌతమ్

  • August 14, 2018 / 10:54 AM IST

హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి పదుల సంఖ్యలో సినిమాలు చేసి, నటించిన అన్నీ సినిమాల్లో అందాలు ఆరబోసినా అదృష్టం అచ్చిరాక.. కొన్నాళ్లు ఇండస్ట్రీని వదిలేసి “జబర్డస్త్” అనే కామెడీ షోతో యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇక అమ్మడు అందాల ప్రదర్శన విషయంలో పరిమితులు దాటేసి రెచ్చిపోయిన “గుంటూరు టాకీస్” ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ తర్వాత మళ్ళీ చాలా సినిమాల్లో అందాలు అదే విధంగా ఆరబోసి, ఎంత సెక్సీగా కనిపించినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు రష్మీకి.

అయితే.. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ “అంతకు మించి” అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ కొత్తవాళ్లే నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 24న విడుదలకానుంది. ఎప్పట్లానే ఈ చిత్రంలో “అంతకు మించి”న అందాల ప్రదర్శన ఇచ్చి పోస్టర్స్ తో జనాల్ని థియేటర్లకు రమ్మని పిలుస్తోంది. హారర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే.. ఇక అమ్మడు సినిమాలకు మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టి తనకు మంచి పేరుతోపాటు, పేమెంట్ కూడా వస్తున్న కామెడీ షోస్ చేసుకుంటూ ఉండడమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus