అభిమానికి షాక్ ఇచ్చిన రష్మీ

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన  రష్మీ … “గుంటూరు టాకీస్” సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన మూవీ “అంతకు మించి”. ఇందులో రష్మీ అంతకు మించి అందాలు ఆరబోసింది. జానీ దర్శకత్వంలో సతీష్ హీరోగా నటించిన సినిమా ఆగస్టు 24 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సందర్భంగా రష్మీ అభిమానులతో ట్విట్టర్ వేదికపై ముచ్చటించింది. వారు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చింది. “మీ యాంకరింగ్, కామెడీ టైమింగ్ మాకెంతో ఇష్టం, బోల్డ్ క్యారెక్టర్లకు పరిమితం కావద్దంటూ.. ఓ అభిమాని సలహా ఇవ్వగా.. ఈ కామెంట్‌పై రష్మీ స్పందిస్తూ.. ‘‘యాంకరింగ్‌ అనేది కెమెరా ముందు మన వ్యక్తిత్వాన్ని చూపించడం, అదే సినిమాల్లో నటించడం అనేది ఓ పాత్రలో జీవించడం.

ఈ రెండింటినీ పోల్చలేం. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావాలనే ఆలోచన నాకు లేదు’’ అని తెలివిగా సమాధానమిచ్చింది. అంతేకాకుండా ఉచిత సలహా ఇచ్చిన నెటిజన్ కి రష్మీ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘‘రష్మీ నువ్వు సొంతంగా సినిమాలు చేసుకో.. దర్శకుల నుండి వచ్చే అవకాశాల కోసం వేచిఉండకు’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేయగా.. దీనిపై రష్మీ స్పందిస్తూ.. ‘‘తప్పకుండా చేస్తా.. నా బ్యాంకు ఖాతా డీటెయిల్స్ నీకు పంపుతా.. 3 కోట్లు పంపు.. గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావ్’’ అని రిప్లై ఇచ్చింది. దీంతో రష్మీకి ఎక్కడ ఎలా అందాలను పొదుపుగా వాడాలో మాత్రమే కాదు.. మాటలను ఎంత పొదునుగా వాడాలో, చిలిపిగా వాడాలో కూడా తెలుసని అభిమానులు అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus