ఒక్క మాటతో రూమర్లు కొని తెచ్చుకున్న రేష్మి!

సెలెబ్రెటీస్ ఏ మాట మాట్లాడినా అందులో ఏ అర్ధం ఉన్నా…మన వాళ్ళు నానార్ధాలు వెతుకుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఒక్కోసారి మన వాళ్ళు నోరు జారుతూ ఉంటారు, ఇక ఆ సంధర్భంలో అయితే మీడియాకు ఆహారం దొరికినట్లే అనుకోండీ. అసలు విషయం ఏంటి అంటే జబర్దస్త్ యాంకర్ గా మంచి హాట్ హాట్ గా కనిపించే రేష్మికి మాస్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారి. యాంకర్ గా చెలరేగిపోతూ సినిమాల్లో స్థిరపడాలి అని పక్కా ప్లాన్ లో ఉన్న రేష్మి తాను మాట్లాడిన మాటల వల్ల చిక్కుల్లో పడింది. ఇంతకీ ఆమె ఏమంది? అస్సలు ఏమయింది అంటే…. ఒకసారి ఈ కధ చదవండి, లేటెస్ట్ గా యాంకర్ రష్మి విశాఖపట్నంలోని మద్దేలపాలంలో ఒక షాప్ ప్రారంభోత్సవంలో చేసిన కామెంట్స్ ఇప్పడు అనేక గాసిప్పులకు తావు ఇస్తోంది. తనను చూడానికి విపరీతంగా వచ్చిన అభిమానులను చూసి రష్మి నోరుజారింది. తన కోసం వచ్చిన అభిమానులను చూసి ఒప్పొంగి పోతు తాను వైజాగ్ లో సెటిల్ అవుతున్నాని చెప్పింది రష్మి.

దీనితో  ఈమె అన్న మాటలను ఆధారంగా తీసుకుని ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ వైజాగ్ కు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. వారిద్దరి పెళ్లి త్వరలో జరగబోతోంది అంటూ ప్రచారం మొదలు అయింది. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిపోవడంతో రష్మి రంగంలోకి దిగి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ క్లారిటీలు ఇస్తోంది.అంతేకాదు తాను వైజాగ్ లో స్థిరపడినంత మాత్రాన అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అర్థంకాదని రేష్మి వాపోతుంది. అదేవిధంగా తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని అంటూ ఇవన్ని గాలి వార్తలు అంటూ ఈ వార్తలపై తన సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తున్నట్లు టాక్. మొత్తంగా చిన్న మాట పొరపాటున మాట్లాడిన ఈ హాట్ యాంకర్ కి ఎన్ని ఇబ్బందుకు తలెత్తాయి పాపం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus