‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్3’ ఇక క్లయిమాక్స్ కు వచ్చేసింది. గత వారం వరుణ్ భార్య వితిక హౌస్ నుండీ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు. వాళ్ళే శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రాహుల్, శివజ్యోతి …! వీళ్ళలో ఒక్క రాహుల్ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అంటే రాహుల్ ఫైనల్ కు వెళ్ళిపోయినట్టే..! ఇక నామినేషన్స్ లో ఎవరోఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీముఖి కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె ప్రతీసారి నామినేషన్స్ కు వెళ్ళినా సేఫ్ అవుతూనే వస్తుంది. అయితే ఎప్పుడూ రాహుల్ నామినేషన్స్ లో ఉంటే.. ఎక్కువ ఓట్లు మాత్రం అతనికే పడుతున్నాయి. ఇప్పుడు రాహుల్ లేదు కాబట్టి శ్రీముఖి వందకు వంద శాతం ఈ వారం సేఫ్ అయిపోయినట్టే..! అయినప్పటికీ సెలబ్రిటీలు కూడా శ్రీముఖి కోసం ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఇందులో మొదట యాంకర్ రష్మీ ఉంది. ‘శ్రీముఖి ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తి. నాకు పర్సనల్ గా ఆమె చాలా బాగా తెలుసు. శ్రీముఖి నువ్వు టైటిల్ గెలిచి మమ్మల్ని గర్వపడేలా చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక జబర్దస్త్ కమెడియన్ ‘ఆటో రాంప్రసాద్’ కూడా ‘శ్రీముఖినే విన్నర్ కావాలని కోరుకుంటున్నట్టు’ తెలిపాడు. అయితే తనకి ఉన్న క్రేజ్ ప్రకారం ఈ వీక్ నామినేషన్స్ నుండీ బయటపడటం శ్రీముఖి కి పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ ఏకంగా సెలబ్రిటీలే.. శ్రీముఖి ఏకంగా విన్నర్ కావాలని ట్వీట్ చేయడం చూస్తుంటే.. ‘ ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ అవుతుంది’ అని మహేష్ విట్టా చెప్పినట్టు జరుగుతుందా అనే అనుమానం కలుగక మానదు. దీంతో శ్రీముఖి కోసం రాజకీయాలు మొదలైపోయాయి అని కొందరు నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.