రష్మీ బాడీలో ఆ పార్ట్శ్ కి ఇన్సూరెన్స్ చేయిస్తుందట

  • August 23, 2018 / 11:38 AM IST

రష్మీ సెక్సీగా ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలు, హోస్ట్ చేస్తున్న షోలు చూసినా చాలు. ఎక్స్ పోజింగ్ చేసినా చేయకపోయినా.. రష్మీ కళ్ళల్లో ఏదో తెలియని మత్తు ఉంటుంది. అయితే.. నా సెక్సప్పీస్ నా కళ్ళలో కాదు కాళ్ళల్లో ఉంటుంది అంటోంది రష్మీ గౌతమ్. ఈ విషయాన్ని రష్మీ మాత్రమే కాదు ఆమె అభిమానులు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. “ఒక్కొక్క‌రిలో ఒక్కో అందం అంటుంది. బ‌హుశా నా థైస్ (తొడ‌లు) జ‌నాల్ని ఆక‌ట్టుకుంటున్నాయోమో” అని నిర్మోహ‌మాటంగా చెప్పింది ఈ సుంద‌రి.

అందుకే ఆమెతో తాజాగా “అంతకు మించి” చిత్రాన్ని నిర్మించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమె లెగ్స్‌ని ఎక్కువ‌గా ఎక్స్‌పోజింగ్ చేయించి వాటిని ప్ర‌మోష‌న్ పోస్ట‌ర్‌ల‌లో వాడుతున్నారు. ఈ విషయమై ట్విట్టర్ లో ఓ రష్మి అభిమాని ప్రస్తావించగా.. రష్మీ సరదాగా.. “నా తొడలకు ఇన్స్యూరెన్స్ చేయించాలి” అని కామెంట్ చేయడం విశేషం. మరి రష్మీ కోరికను మన్నించి ఏ ఇన్స్యూరెన్స్ సంస్థ అయినా ముందుకొచ్చి ఆమె థైస్ కు భీమా కల్పిస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus