నేషనల్ క్రష్ గా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఈమె హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే రష్మిక కేవలం గ్లామరస్ పాత్రలలో మాత్రమే కాకుండా ఢీ గ్లామర్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈమె ఇలాంటి పాత్రలలో నటించిన తన అందం మాత్రం రెట్టింపు అవుతుందని చెప్పాలి
ఇకపోతే రష్మిక ఇలా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈమె ఓకే వెయిట్ మైంటైన్ చేస్తూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని తాను ఎంతో ఇష్టంగా ఫుడ్ తింటారని చెప్పాలి. ఇలా ఈమె ఎంత ఇష్టంగా ఫుడ్ తింటారో అంతే ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారని చెప్పాలి. ఇలా తరచు వర్క్ చేస్తూ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెడతారు.
ఇక ఈమె తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం వెనుక ఎలాంటి సీక్రెట్ లేదని ప్రతిరోజు తప్పనిసరిగా ఏడు లీటర్ల వరకు నీటిని మిస్ కాకుండా తీసుకుంటారనే తెలుస్తుంది. ఇక ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్ కంపల్సరిగా ఉండాల్సిందేనట. ఇలా నీటిని తాగడంతో పాటు వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి జ్యూస్ అలాగే పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.
ఇలా రష్మిక (Rashmika) నీటిని అధికంగా తీసుకోవడమే ఆమె బ్యూటీ సీక్రెట్ అని వాటర్ అధికంగా తాగటం వల్లే తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుంది అంటూ ఈమె బ్యూటీ సీక్రెట్ కి సంబంధించినటువంటి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.