Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రష్మిక నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా రష్మిక కెరీర్ మొదలు కాగా తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టి తొలి సినిమాతోనే రష్మిక నటిగా మంచి మార్కులు వేయించుకోవడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా రష్మిక కొన్ని విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వారసుడు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పుష్ప2 సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సొంతూరిలో ఉన్న రష్మిక పండుగ రోజులలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు.

కొత్త సినిమాలు మొదలయ్యే ముందు కూడా బంగారం, వెండి కొనుగోలు చేస్తానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సెంటిమెంట్ ను ఇప్పటికీ కొనసాగిస్తున్నానని రష్మిక పేర్కొన్నారు. నన్ను నా చెల్లిని నాన్న మహాలక్ష్ములు అని అంటారని రష్మిక చెప్పుకొచ్చారు. నాన్న అలా చెప్పిన సమయంలో నాకు చాలా గర్వంగా అనిపిస్తుందని రష్మిక కామెంట్లు చేశారు. మహాలక్ష్మిని ఆహ్వానించడానికి పండుగల సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం జరుగుతుందని రష్మిక పేర్కొన్నారు.

రష్మిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక కొత్త ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus