Rashmika: తన గురించి చాలా విషయాలు చెబుతానంటున్న శ్రీవల్లి!

సినిమా నటులు – సోషల్‌ మీడియా… ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా జనాలకు, అభిమానులకు, మీడియాకు ఏ విషయమైనా చెప్పాలంటే… కచ్చితంగా సోషల్‌ మీడియా ద్వారానే చెబుతున్నారు. దీని కోసం ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ సోషల్‌ మీడియాను తెగ వాడేస్తున్నారు. చాలామంది ఇక్కడే ఉన్నారు. అతి కొద్దిమంది యూట్యూబ్‌కి వెళ్తున్నారు. అలాంటి కొద్దిమందిలో రష్మిక మందన కూడా ఉంది. ఇటీవల ఛానల్‌ను ప్రారంభించిన ఆమె… తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది.

Click Here To Watch Now

అందులో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అన్నట్లు ప్రశ్నలు కూడా ఆమె సన్నిహితురాలే అడిగారు. జనాలు నీ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా నీ Xల గురించే అడుగుతారు. కానీ నేను నీ Yల గురించి అడుగుతాను అంటూ… ఈ వీడియో మొదలవుతుంది. ఆ ఆలోచనకు రష్మిక కూడా ఆసక్తి చూపిస్తుంది. ఆ తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. ఆ ప్రశ్నలు, వాటికి ఆమె చెప్పిన సమాధానాలు ఇవిగో…

* నీకు ట్రావెలింగ్‌ అంటే ఎందుకు ఇష్టం?

– నిజమే, నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మెమొరీస్‌ సంపాదించడం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్‌తో వాటిని పొందొచ్చు.

* నీకు నటన అంటే ఎందుకు ఇష్టం?

– నన్ను నేను తెలుసుకోవడానికి నటనకు నాకు చాలా ఉపయోగపడుతుంది.

* నీకు డ్యాన్స్‌ అంత ఇష్టం ఎందుకు?

– నా చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ చేస్తున్నాను. అలా దాని మీద ఇష్టం పెరిగిపోయింది.

* డిజర్ట్స్‌ అంటే ఎందుకు అంత ఇష్టం?

– అసలు ఆ ప్రశ్న ఎందుకు. స్వీట్‌లో క్రీమ్‌ చీజ్‌ను అలా నోట్లో వేసుకుంటే… అద్భుతంగా ఉంటుంది కదా.

* ఎక్సర్‌సైజ్‌లు ఎందుకు ఎక్కువగా చేస్తుంటావ్‌?

– నాకు డిజర్ట్స్‌ అంటే ఎక్కువ ఇష్టం కదా. వాటిని తిన్నాక కూడా ఫిట్‌గా ఉండాలంటే ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి కదా.

ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటూ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగుతుంటే… ఇంకా నా గురించి తెలియాలి అంటే… నా యూట్యూబ్‌ ఛానల్‌ను ఫాలో అవ్వండి అంటూ ఆ షార్ట్‌ వీడియోలో చెప్పింది రష్మిక. ఆ వీడియో దిగువనే ఉంది. ఫాలో ఆలోచన ఉంటే చేసేయండి మరి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus