సుకుమార్ మేకింగ్.. రష్మీక సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదట

టాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత ఎక్కువవుతోన్న సమయంలో అనూహ్యంగా స్టార్ గా ఎదిగిన బ్యూటీ రష్మీక మందన్న. బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ తో అమ్మడు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనంతరం అవకాశాలను మరింత సులభంగా అందుకుంది. ఇక రష్మీక కెరీర్ లో మొదటి సారి పుష్ప అనే బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడుతోంది.

ఇక సుకుమార్ మేకింగ్ కు రష్మీక మందన్న నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు షూటింగ్ కు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ఆ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ.. లొకేషన్ కు వెళ్ళడానికి కొన్నిసార్లు గంటల సమయం పట్టేది. మేకప్ కోసం మరో రెండు గంటలు.

షూటింగ్ లో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పింది. ఇక రోజులో 4గంటలు మాత్రమే నిద్రపోవాల్సి వచ్చిందని అంటూ అస్సలు టైమ్ దొరికేది కాదు, తమ కష్టాన్ని వెండితెరపై చూస్తారని రష్మీక వివరణ ఇచ్చింది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus