అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ మూవీకి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా ఐదు బాషలలో విడుదల కానుంది. సుకుమార్ ఈ చిత్రాన్ని రెడ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. రాయల సీమ మాస్ కుర్రాడిగా డీగ్లామర్ రోల్ చేస్తున్న బన్నీ పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉంటాయని కూడా టాక్ వస్తుంది.
కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రశ్మికను ఎంపిక చేయడంతో ఆమె లక్ పండిందని అందరూ అనుకున్నారు. ఐతే పుష్ప సినిమాలో రష్మిక పాత్రకు ఆమె ఫ్యాన్స్ ఊహించుకునేంత విషయం ఉండని వినిపిస్తుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుండగా ఆమె అల్లు అర్జున్ లవర్ రోల్ చేస్తుందట. దీనితో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఆమెదే నట. ఈ నేపథ్యంలో బన్నీతో సాంగ్స్, డ్యూయెట్స్ వంటివి కూడా ఆమెకే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
రష్మిక మఫ్టీలో ఉండే ఫారెస్ట్ అధికారి అయ్యే ఛాన్స్ కూడా కలదట. ఏదిఏమైనా రశ్మికకు పుష్ప మూవీలో బన్నీతో ఇంటిమసీ సీన్స్ తక్కువే అని తెలుస్తుంది. దీనితో రష్మిక ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురి అవుతున్నారట. ఆమె పాత్ర రంగస్థలంలో సమంత రేంజ్ లో ఉంటుంది అనుకుంటే అంత లేదని అర్థం అవుతుంది. స్క్రీన్ స్పేస్ మరియు పాత్ర ప్రాధాన్యం విషయంలో రష్మిక మరియు నివేదాకు ఈక్వల్ గా స్కోప్ ఉంటుందట.