Rashmika Mandanna: రష్మిక కోసం 70 కోట్ల బడ్జెట్.. నిజమేనా?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస హిట్స్‌తో టాప్ లీగ్‌లో దూసుకెళ్తోంది. యానిమల్ (Animal), పుష్ప 2(Pushpa 2: The Rule) , ఛావా  (Chhaava)  వంటి బిగ్ బడ్జెట్ సినిమాలు ఆమెకు క్రేజ్‌ను పెంచగా, సల్మాన్ ఖాన్‌ (Salman Khan) సరసన సికిందర్లో (Sikandar) కూడా నటిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో మంచి మార్కెట్ కలిగి ఉన్న రష్మికతో స్టార్ హీరోలు సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు.

Rashmika Mandanna

ఇప్పుడు ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని UV క్రియేషన్స్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోందని టాక్. లేడీ ఓరియెంటెడ్ కథతో రష్మిక‌ను హీరోయిన్‌గా పెట్టి పాన్‌ ఇండియా మూవీ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ 70 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉండబోతుందని టాక్. బాలీవుడ్‌ మేకర్స్‌ కూడా రష్మిక నేడు బిజినెస్ పరంగా స్ట్రాంగ్‌ మార్కెట్ కలిగి ఉందని అర్థం చేసుకున్నారు. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం డిస్కషన్స్‌ జరుగుతున్నాయని సమాచారం.

అయితే ఇది సాధ్యమవాలంటే, రష్మిక డేట్స్ ఖరారు కావాలి. ప్రస్తుతం ఆమె చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తోంది. దీంతో యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం రష్మిక డేట్స్‌ అడ్జస్ట్ చేయగలదా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా ఒక సినిమా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఈ ప్రాజెక్ట్‌ త్వరగా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

గతంలోనూ యూవీ క్రియేషన్స్‌ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ట్రై చేసింది. ప్రస్తుతం అనుష్క (Anushka Shetty)  ప్రధాన పాత్రలో ఘాటి  (Ghaati) అనే సినిమా నిర్మిస్తోంది. ఇప్పుడు అదే బాటలో మరో పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకుని, రష్మికను లైన్‌లో పెట్టాలని చూస్తోంది. కథ, బడ్జెట్ పరంగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ఉంటే, రష్మిక కెరీర్‌లో ఇదొక కీలకమైన సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్‌ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలి.

 ‘కాకులని ఒక్కటి చేసిన ల*జ కొడుకు కథ’..గ్లింప్స్ లోనే ఇన్ని బూతులంటే, ఇక సినిమాలో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus