Rashmika, Rakshit: రష్మిక కల సాకారమైందన్న రక్షిత్ శెట్టి.. ఆ బంధం ఉందంటూ?

  • February 17, 2024 / 10:20 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. రష్మిక ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. తాజాగా బన్నీ ఒక సందర్భంలో పుష్ప3 మూవీ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. పుష్ప3 మూవీకి సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారని చెప్పవచ్చు.

మరోవైపు రష్మిక అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో ఈ బ్యూటీకి స్థానం దక్కడంతో సినీ ప్రముఖులు రష్మికకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రష్మికకు ఈ ఘనత దక్కడం గురించి రక్షిత్ శెట్టి సైతం స్పందించారు. రష్మికకు లైఫ్ లో సక్సెస్ కావాలని ఎన్నో సాధించాలని గొప్పగొప్ప కలలు ఉండేవని ఆ కలలను రష్మిక సాకారం చేసుకుంటోందని రక్షిత్ కామెంట్లు చేశారు.

రష్మికతో పెళ్లి ఆగిపోవడం గురించి రక్షిత్ మాట్లాడుతూ పెళ్లి ఆగిపోయినా రష్మిక కాంటాక్ట్ లో ఉందని మేమిద్దరం టచ్ లోనే ఉన్నామని రక్షిత్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రష్మిక రక్షిత్ శెట్టి గురించి ఈ మధ్య కాలంలో మీడియాతో ఎప్పుడూ మాట్లాడలేదు. మరోవైపు రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం నటిస్తున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో మన్మథుడు2 తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. రష్మిక వరుసగా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రష్మిక 4 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని వార్తలు తెగ వైరల్ కాగా ఈ బ్యూటీ ఆ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. యాడ్స్ లో కూడా నటిస్తూ (Rashmika) రష్మిక కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus