Rashmika: క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అర్థం చేసుకోగలను

  • May 19, 2023 / 07:31 PM IST

ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఇటీవల పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తానే బాగా నటిస్తానని చెప్పినట్టు ఐశ్వర్య రాజేష్ గురించి రూమర్లు వినిపించాయి. దీంతో ఈ వివాదం పై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ తాను అల అర్ధం వచ్చేలా మాట్లాడలేదని, కేవలం పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రకు తాను బాగా సెట్ అవుతానని తెలిపినట్లు క్లారిటీ ఇచ్చింది.

అయితే కొంతమంది పని కట్టుకుని మరి దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం నిలిపివేయమని వేడుకుంది. ఇలా శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇవ్వటంతో, తాజాగా రష్మిక కూడా ఈ వివాదం పై స్పందించింది. ఈ క్రమంలో..” హాయ్ లవ్.. ఇప్పుడే జరిగినదంతా చూసాను. నువ్వు మాట్లాడిన మాటలు వెనుక ఉన్న భావాన్ని నేను అర్థం చేసుకోగలను. వాటికోసం నువ్వు సంజాయి చేయవలసిన అవసరం లేదు.

నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం గురించి నీకు బాగా తెలుసు. ఫర్హాన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చావు. ఆల్ ది బెస్ట్ ” అంటూ ఐశ్వర్య రాజేష్ ని ఉద్దేశిస్తూ రష్మిక నోట్ షేర్ చేసింది. రష్మిక షేర్ చేసిన ఈ నోటు ప్రస్తుతం ఫైనల్ గా మారింది .ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.

రష్మిక (Rashmika) నటిన గురించి మాట్లాడినందుకు ఐశ్వర్య రాజేష్ వాక్యలను తప్పుగా అర్థం చేసుకొని వివాదాలు సృష్టించారు. ఈ వివాదం గురించి ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా రష్మిక స్పందిస్తూ ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నీ మాటలు వెనుక ఉన్న అర్థాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ ఐశ్వర్య రాజేష్ పట్ల ఉన్న నమ్మకం, అభిమానాన్ని తెలియజేసింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus