Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రష్మిక రిలేషన్ ఎలా ఉంటుందంటే?

రష్మిక రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటి? దీనికి ఆమె కూడా సరైన సమాధానం ఇవ్వకపోవచ్చు. రిలేషన్‌షిప్‌ గురించి రష్మిక ఓపెన్‌గా మాట్లాడే రకమే. అందుకేనేమో తన పాత బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి, వారితో.. వాళ్ల కుటుంబాలతో ఉన్న రిలేషన్‌ గురించి మాట్లాడింది. దీంతో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్మిక బాయ్‌ఫ్రెండ్స్‌ అంటే.. ముఖ్యంగా వినిపించే పేర్లు రక్షిత్‌ శెట్టి, విజయ్‌ దేవరకొండనే.

రక్షిత్‌ శెట్టి – రష్మిక మందన మధ్య ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక విజయ్‌ దేవరకొండతో ఆమె రిలేషన్‌లో ఉందా? లేదా? ఉంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. వాటికి ఆ ఇద్దరూ సమాధానాలు ఇవ్వరు. అలా అని లేదని కూడా చెప్పరు. కాబట్టి రష్మిక చెప్పిన బాయ్‌ఫ్రెండ్స్, వారి కుటుంబాలు అంటే రక్షిత్‌, విజయ్‌నే కావొచ్చు అనుకుందాం.

బాయ్‌ ఫ్రెండ్స్‌ గురించి ఓసారి చెప్పొచ్చుగా రష్మిక అని అడిగితే.. ‘‘నా మాజీ బాయ్ ఫ్రెండ్స్‌ని నేను ఇప్పటికీ స్నేహితుల్లాగే భావిస్తాను. వారి ప్రస్తుత పార్ట్నర్స్, ఫ్యామిలీని మీట్ అవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమాధానం ఇచ్చిందట. వారు ఎదురుపడితే పలకరించేంత చనువు అయితే ఉందని చెప్పిందట. మామూలుగా అయితే మాజీలతో స్నేహాన్ని కొనసాగించడం అంత మంచి లక్షణం కాదు. కానీ నేను ఎవరికీ శత్రువుగా ఉండను అని రష్మిక చెప్పుకొచ్చింది. అందుకే వారితో ఇప్పటికే స్నేహం కొనసాగిస్తాను అని చెప్పింది.

రష్మిక సినిమాల విషయానికొస్తే.. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. హిందీలో ‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ సినిమాలు చేసింది. అందులో ‘గుడ్‌ బై’ ఈ నెల ఏడో తేదీ రిలీజ్‌ అవుతోంది. తెలుగులో ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తోంది. తమిళంలో ‘వారిసు’లో నటిస్తోంది. ఇది కాకుండా కార్తి సినిమాను ఇటీవల ఓకే చేసిందని సమాచారం. హిందీలో ‘యానిమల్‌’ కూడా చేస్తోంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus