కన్నడ చిత్రం నుంచి బయటికి వచ్చిన రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక అతి తక్కువ సమయంలోనే తెలుగువారికి అభిమాన హీరోయిన్ అయిపోయింది.  చలో సినిమాతో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. గీత గోవిందం సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాని, నాగార్జున మల్టీస్టారర్ మూవీలో రష్మిక నటిస్తోంది. మరో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్”  అనే సినిమాలో మరోసారి విజయ్ దేవర కొండతో రొమాన్స్ చేయనుంది. అలాగే రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌ హీరోగా “భీష్మా” సినిమాని చేయబోతున్నారు.

ఈ సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ చిత్రాలకంటే ముందు కన్నడలో “వ్రిత్రా” అనే డిఫరెంట్ కథకి ఓకే చెప్పింది. అయితే ఆ సినిమా నుంచి బయటికి వచ్చినట్టు ఈరోజు స్పష్టం చేసింది. ” “వ్రిత్రా” నుంచి తప్పుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి చిత్రం చేయకూడదని వైదొలుగుతున్నాను. నేను వదులుకున్న పాత్రకు ఇంకొకరు బాగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గౌతమ్ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు. ఆమె కన్నడ సినిమా నుంచి బయటికి రావడం వెనుక తెలుగులో ఆమె ఒప్పుకున్న సినిమాలే కారణమయి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.rashmika-responds-on-rumores-about-that-movie

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus