బిగ్ బాస్ హౌస్ లో ర్యాంకింగ్ ఎపిసోడ్ అనేది మరోసారి గొడవలకి తెరలేపింది. అర్జున్ ఇంకా శోభాశెట్టి ఇద్దరికీ పెద్ద గొడవ అయ్యింది. అలాగే, అశ్వినికి యావర్ కి మద్యన కూడా తగాదా జరిగింది. ఇక పల్లవి ప్రశాంత్ కి రతికకి అయితే ఒక రేంజ్ లో ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఇందులో పల్లవి ప్రశాంత్ తన బాధని మొత్తం చెప్పి మరోసారి ఆడియన్స్ తో శభాష్ అనిపించుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తను 2వ నెంబర్ కి డిసర్వ్ అని చెప్పి తన రీజన్స్ తను చెప్పాడు.
కానీ, రతిక మాత్రం నువ్వు ఫస్ట్ వీక్స్ లో గేమ్ అస్సలు ఆడలేదు. నీకు ఒక ఇన్సిడెంట్ వల్ల నావల్ల పాజిటివిటీ వచ్చింది. అదే నాకు నెగిటివ్ అయ్యింది మైనస్ అయ్యింది. ఇంటి నుంచీ వెళ్లిపోయేలా చేసింది. ఫస్ట్ వీక్స్ లో నువ్వు రతిక చుట్టూ తిరుగుతున్నావనే అన్నారు అందరూ అంటూ మాట్లాడింది. దీనికి పల్లవి ప్రశాంత్ గట్టి కౌంటర్ వేశాడు. నేను నా ఆట ఆడాను అని, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ గేమ్ ఆడుతునే ఉంటానని చెప్పాడు. ఇక్కడే రతిక రెచ్చిపోయింది. నీవల్ల నా గేమ్ బ్యాడ్ అయిపోయిందని చెప్పింది.
కానీ పల్లవి ప్రశాంత్ ఒప్పుకోలేదు. నన్ను నువ్వు చాలామాటలు అన్నావ్ అని, గుండు గీకేస్తా, మీసం గొరిగేస్తా అన్నావ్.అలాగే మా అమ్మని తిట్టినావ్, మా బాపుని అన్నావ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు, నోట్లో పెట్రోల్ పేసి అంటించేస్తా అని కూడా అన్నావ్ అంటూ రతిక అన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుని తిరిగి ఇచ్చేశాడు. దీంతో రతికకి సౌండ్ లేదు. ప్రతి డైలాగ్ తనకి ఇంతలా గుర్తుండిపోతుందని రతిక ఊహించలేదు. అనవసరంగా నేను ఈ టాపిక్ ని తీస్కుని వచ్చానా అని తలపట్టుకుని పక్కకెళ్లి మరీ కూర్చుంది.
మాట్లాడక్క, నువ్వు అన్నది చెప్పు నేను శివాజీ అన్న లెటర్ శాక్రిఫైజ్ చేస్తే దాంతో టాస్క్ ఆడాను ఈ సీజన్ లో ఫస్ట్ ఇంటి కెప్టెన్ అయ్యానంటూ చెప్పాడు. అలాగే, తన గేమ్ గురించి ప్రతిదీ హైలెట్ చేశాడు. దీంతో రతిక తను అనవసరం అయిన టాపిక్ ని కెలుక్కున్నానని అనుకుంది. చాలాసేపటి వరకూ నెంబర్ చెప్పలేదు. శివాజీ ల్యాగ్ చేయకుండా చెప్పు, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారంటే, నా లెక్క ప్రకారం అయితే నెంబర్ 7 అన్నా అంటూ ముక్తాయింపు ఇచ్చింది. దీంతో పల్లవి ప్రశాంత్ మరోసారి రెచ్చిపోయాడు.
అంతేకాదు, నా ఆట ఇది.. ఇట్లనే ఉంటదక్కా అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, తనని అన్నమాటలు అన్నీ తిరిగి అప్పజెప్పేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శభాష్ పల్లవి ప్రశాంత్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, రతిక ఓటింగ్ పర్సెంటేజ్ కూడా దీనిపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక మరోవైపు రతిక కూడా చాలా కన్ఫూజన్ గా ఈ గేమ్ ని ఆడింది. ఏదో చేద్దామనుకుని గేమ్ స్టార్ట్ చేస్తే మరేదో అయ్యింది. ఈ ఎపిసోడ్ పల్లవి ప్రశాంత్ ని మరో మెట్టు ఎక్కించేలా చేసింది.
నిజానికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రతిక పల్లవి ప్రశాంత్ తో ఇదే విషయాన్ని మాట్లాడింది. కానీ, నువ్వెవడివి ప్రశాంత్ అంటూ నన్ను ఆరోజు అన్నావ్ అంటూ పల్లవి ప్రశాంత్ రతిక టాపిక్ ని తిప్పికొట్టాడు. అంతేకాదు, ఆ తర్వత కూడా ఈ టాపిక్ ని తిరిగి తీసుకుని రాకుండా రతికని అక్కా అనే పిలుస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు రతిక ఈ పాయింట్ ని మరోసారి తెరమీదకు పల్లవి ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తీస్కుని వచ్చిందని చెప్తున్నారు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఆడియన్స్. అదీ మేటర్.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!