ఇటీవలే విడుదలైన ‘సుప్రీమ్’ చిత్రంలో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న భోజ్ పురి నటుడు రవి కిషన్ తాజాగా నటిస్తున్న మరో చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. నిత్యా మీనన్, సందీప్ కిషన్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రవికిషన్ ఓ సైకోపాతిక్రో ల్ లో నటిస్తున్నాడు. ఈ పాత్ర తనకెంతో బాగా నచ్చిందని, ఈ పాత్ర కోసం తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు రవి తెలిపాడు.
అంతేకాకుండా డైలాగ్ లు చెప్పే సమయంలో తప్పులు పోకుండా ఉండేలా ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని కూడా నియమించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.