మాస్ హీరో కొత్త ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు సొంత బ్యానర్ లు ఉన్నాయి. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నాడు. అల్లు వారికి సొంతగా రెండు బ్యానర్లు ఉన్నాయి. మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఇలా పెద్ద కుటుంబాలతో పాటు నాని, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు కూడా నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ వంతు వచ్చింది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ ఇప్పుడు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు.

ఆర్.టీ.వర్క్స్(RT Works) పేరుతో సొంతంగా బ్యానర్ ను మొదలుపెట్టాడు. ఇందులో తక్కువ బడ్జెట్ లో సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడు. టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసే నటులు, దర్శకులతో ఈ బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నాడు రవితేజ. ఇప్పటికే రవితేజ అసోసియేట్ ఒకరు కథలు ఉంటే నేరేట్ చేయమని కుర్ర దర్శకులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ఈ బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే ఇందులో కేవలం బయట వాళ్లతోనే సినిమాలు చేస్తారా..? లేక రవితేజ తను నటించే సినిమాలను కూడా నిర్మించుకుంటారో చూడాలి. చాలా కాలంగా హిట్టు లేక ఇబ్బంది పడిన ఈ మాస్ హీరో ఇటీవల ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus