సిట్ ముందుకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న రవితేజ!
- July 27, 2017 / 12:36 PM ISTByFilmy Focus
వారం రోజులుగా డ్రగ్స్ కేసు విచారణ సాగుతోంది. నోటీసులు అందుకున్న వారు రోజుకొకరు చొప్పున ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతున్నారు. ఈ రోజు ముమైత్ ఖాన్ ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేపు (శుక్రవారం) హీరో రవితేజని విచారించనున్నారు. రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ వాటికీ రవితేజ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. విదేశాల నుంచి ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
సిట్ ముందుకు వెళ్లే ముందు న్యాయపరమైన విషయాలను తెలుసుకోవడానికి వ్యక్తిగత లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంతే కాదు తన ఇంటి నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినీ తారలపై విచారణ వచ్చే నెల 4 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత అసలు డ్రగ్స్ కేసులో వెనుక ఉన్న రహస్యం బయటపడుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















