10 కిలోలు పెరిగిన రవితేజ..!
- May 12, 2016 / 02:07 PM ISTByFilmy Focus
గతేడాది విడుదలైన చిత్రాల్లో మాస్ మహారాజ్ రవితేజ కాస్త బరువు తగ్గినట్లు అనిపించాడని, అతని ముఖంలో కాస్త గ్లామర్ తగ్గిందని ఆయన అభిమానులు చెవులు కోరుక్కున్నారు. దాంతో ఆయన ఇప్పుడు 10 కిలోలు పెరిగారని, ఆయన ముఖంలో మునుపటి గ్లామర్ సంతరించుకుందని అంటున్నారు. ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ల సలహాలతో ఆరోగ్యకరంగా ఆయన బరువు పెరిగారట.
మరోవైపురవి తేజ సిక్స్ ప్యాక్ ట్రై చేయడంతో ఆయన కొత్త లుక్ లో ఎలా ఉండనున్నారోనని ఆయన అభిమానులు కాస్త ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో రవితేజ, రాశి ఖన్నా జంటగా నటించనుండగా.. జూన్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















