టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో రవితేజ ఒకరు కావడం గమనార్హం. ఈ ఏడాది ఖిలాడీ సినిమాను ఇప్పటికే విడుదల చేసిన రవితేజ అతి త్వరలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ కళ్లు చెదిరే స్థాయిలో పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రవితేజ సీన్లను పాతిక రోజుల్లో ఫినిష్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ మొదట రోజుకు 50 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చేలా రవితేజతో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.
అయితే వేర్వేరు కారణాల వల్ల రవితేజ ఈ సినిమా కోసం 33 రోజుల పాటు పని చేయాల్సి ఉంది. 33 రోజులకు రవితేజకు 17 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ఆలోచన చేయగా అందుకు భిన్నంగా జరిగిందని బోగట్టా. ప్యాచ్ వర్క్ మినహా రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ పూర్తైందని సమాచారం అందుతోంది. శరత్ మాండవ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా డిజిటల్ హక్కులు సోనీ లివ్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
సోనీ లివ్ ఓటీటీకి ఎక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు లేరనే సంగతి తెలిసిందే. సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలనే ఆలోచనతో సోనీ లివ్ పెద్ద సినిమాలపై దృష్టి పెట్టింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మాస్ మహారాజ్ రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. ఐదు పదుల వయస్సులో కూడా రవితేజ యాక్టివ్ గా ఉంటూ వరుసగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. మాస్ ప్రేక్షకులకు నచ్చే కథలకు రవితేజ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. రవితేజ భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా భారీగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.